33 - సుదర్శన చక్ర పూజా విధి

సూతుడు శౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు. “ఓ శంఖ గదాధరా! గ్రహదోషాలూ, రోగాదులూ, సర్వకష్టాలూ వినష్టము లవ్వాలంటే ఏ పూజను చేయాలి?

“పరమశివా! నీవడిగిన దానికీ సమాధానం సుదర్శన పూజ. ఈ పూజకి ముందు సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి. తరువాత తన నిర్మల హృదయ కమలంలో ఆ సుదర్శనాయుధుని నిలుపుకొని ధ్యానించాలి. ఆ తరువాత ఒక మండలాన్ని నిర్మించి అందులో శంఖ, చక్ర, గదా పద్మ భూషణుడైన కిరీటి, భగవానుడైన విష్ణుదేవుని ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది వివిధోపచారాలతో పూజించాలి.

పూజ చివరల్లో మూలమంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించాలి. హే రుద్రదేవా! మూలమంత్రమిదివలకే చెప్పబడింది కదా! ఆ మంత్ర జపం తరువాత సర్వవ్యాధి దోష, కష్ట వినష్టకమైన ఈ సుదర్శన స్తుతిని శ్రద్ధగా పఠించాలి :

నమః సుదర్శనాయైవ సహస్రాదిత్యవర్చసే  ॥

 జ్వాలా మాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే  ।

 సర్వదుష్టవినాశాయ సర్వపాతక పర్దినే  ॥

 సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే

 ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః  ।

 పాలనార్థాయలోకానాంధుష్టాసుర వినాశినే  ।

 ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాయచ నమోనమః  ॥

నమశ్చక్షుః స్వరూపాయ సంసార భయభేదినే  ।

 మాయా పంజర భేత్రేచ శీవాయచ నమోనమః  ॥

 గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః

కాలాయ మృత్యవేచైవ భీమాయ చ నమో నమః  ॥

 భక్తానుగ్రహదాత్రే చ భక్త గోప్త్రే నమో నమః  ॥ (ఆచార - 33/7 - 16)

విష్ణురూపాయ శాంతాయ చాయు ధానాంధరాయచ  ॥

 విష్ణుశస్త్రాయ చక్రాయ నమోభూయోనమోనమః  ॥

 ఈ స్తోత్రాన్ని వేరేగా చదివినా వచ్చే ఫలం ఇలా వుంటుంది.

ఇతిస్తోత్రం మహత్పుణ్యం

చక్రస్య తవ కీర్తితం  ॥

యః పఠేత్ పరయాభక్త్యా

విష్ణులోకం సగచ్ఛతి  ।

 చక్రపూజా విధింయశ్చ

పఠేద్రుద్ర జితేంద్రియః  ।

సపాపం భస్మసాత్కృత్వా

 విష్ణులోకాయ కల్పతే  ॥

          ఈ విధంగా ఇది విష్ణులోక ప్రాపకం.