గరుడ మహా పురాణము - బ్రహ్మ ఖండము
14 - నారాయణ పూర్ణత - పదార్థాల సారాసారాలు
ఓ పక్షీంద్రా! మూలస్వరూపుడు, పూర్ణగుణ సంపన్నుడు, సర్వథా స్వతంత్రుడు, పురాతన పూర్ణ శరీరుడు, ఆనంద స్వరూపుడు, అనంతుడునగు విష్ణు భగవానునితో సమానులు లేరు. ఆయన చరణాది సర్వాంగములు దేనికదే సంపూర్ణము. ఆయన కున్నంత బలమే ఆయన ప్రశియొక్క రోమానికీ వుంటుంది. కాబట్టి అయన అన్ని విధాలా సంపూర్ణుడు. ఆయనే అన్నింటికీ అందరికీ కర్త, హర్త మరియు ఈ సృష్టిలోని ప్రతి సారాంశానికీ భోక్త. సారమైన అంశాలకే ఆయన భోక్త. సాగహీన, అసార అంశాలనాయన గ్రహింపడు. సమస్త ద్రవ్యాల, ద్రవ్య పదార్థాల సారభాగమే ఆయన దవుతుంది.
ఆయన నిత్యము భక్తులపట్ల దయాళువై వుంటూ భక్తులహిత చింతననే చేస్తుంటాడు. భక్తుల ద్వారా తనకు నివేదింపబడిన భక్ష్య భోజ్యాది పదార్థాలనూ ఉపచారాలనూ అందుకుని వాటిలో సాగభాగాన్ని ఎంతో ఆదరంగా స్వీకరిస్తాడు. కాలం వల్ల పాడైనవి, దూషితపదార్థాలు, భావదుష్ట పదార్థాలు ఆయన స్వీకరణకు నోచుకోవు. ద్రాక్ష వంటి పండ్లు కూడా బాగున్నవే ఆయనకుపెట్టాలి.
అందుకే దేవునికి పెట్టవలసిన సారాసార పరిజ్ఞానాన్ని కలిగివుండడం అవసరం.
నేరేడు వంటి ఫలాలు పండిన తరువాత నాలుగురోజులకి సారహీనమైపోతాయి. పనస పండు నెలరోజులవలకు సారాన్ని కలిగి వుంటుంది. ఖర్జూరం ఆరుమాసాలకీ పులుపెక్కిపోతుంది. పవిత్రమైన కొబ్బరికాయ పగులగొట్టిన తరువాత ఒక రోజే సారవంతంగా వుంటుంది. ఎండుకొబ్బరి, ఎండుఖర్జూరాలకైతే ఈ దోషముండదు.
వక్క ఒక ఏడాది వరకుంటుంది. గాని తాంబూలాన్ని ఒక ఘడియ {24 నిముషాల లోపలే వాడెయ్యాలి. అన్నం, పప్పు వంటివి మూడు గంటలకే అసాగమైపోతాయి. నూనెలో వండిన పదార్థాలు మూడు పక్షాల దాకా చెడవుగానీ నేతితో వండినవీ మాత్రం పన్నెండు గంటలు దాటగానే అసారమైపోతాయి. తొమ్మిది గంటల లోపలేకోసిన కూరగాయలను వాడెయ్యాలి. శృంగవేరం, గజనిమ్మ, ఉసిరిక, కర్పూరం, మామిడి - ఒక యేడాది పాటు సారాన్ని నిలుపుకోగలవు.
తులసీలో సారం పోదు. ఏకాదశినాడు జలంతో కలిపీ దేనినైనా వాడవచ్చును.
తులసీ సర్వదా సారా ఏకాదశ్యామపి ద్విజ ।
ఆర్ద్రావాప్యథవాసుష్కాసార్ద్రాసారవతీ స్మృతా । (బ్రహ్మ....14/29)
అజలం హరి పాద తీర్థమై వుండాలి.
గరుడా! ఆషాఢమాసంలో కూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు నిస్సారమైపోతాయి. అలాగే హరినామాన్ని పలుకని ముఖమూ, హరికి నైవేద్యం చేయబడని పదార్థమూ ఎలాగున్నా నిస్సారాలే.
హరినామ విహీనంతు ముఖం నిఃసారముచ్యతే ।
హరినైవేద్యహీనస్తు పాకో నిఃసార ఉచ్యతే ॥ (బ్రహ్మ....14/37)
మూడు రోజులకి అలసీ పుష్పాలు, ఒక జాముకే మల్లెలూ, అరజాముకే చమేలి జాతి మల్లెలూ సారమును కోల్పోతాయి. మూడేళ్ళ దాకా కేసరం, పదేళ్ళదాకా కస్తూరీ, ఏడాది పాటు కర్పూరం సారవంతాలు గానే వుంటాయి. చందనానికి సదా సారవంతమని పేరు.
Summary of chapter 6 of the Garuda Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
Brahma describes the partial incarnations and descents of various Devas upon the earth to assist Bhagavān Vishṇu in His divine pastimes. The narrative explains how celestial beings take human or subtle forms in alignment with cosmic necessity, acting under the divine command of Prabhu Nārāyaṇa to uphold righteousness and assist in world preservation.